ప్రపంచంలో ఇలాంటి స్కూళ్లు ఎక్కడ లేవు: భట్టి

ప్రపంచంలో ఇలాంటి స్కూళ్లు ఎక్కడ లేవు: భట్టి

గురుకుల విద్యార్థులు దేశానికే మార్గదర్శకం కావాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్య కోసం ఖర్చుకు వెనకాడబోమని చెప్పారు. యంగ్ ఇండియా స్కూళ్లలో అన్ని రకాల పిల్లలు చదువుకుంటారని అన్నారు. 25 ఎకరాలకు  తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి స్కూళ్లు లేవని అన్నారు భట్టి. 

తారతమ్యాలు లేని సమాజం నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.  అధికారాన్ని హోదాగా కాకుండా.. సేవగా భావిస్తామన్నారు భట్టి.  సంపద పెంచి పేదలకు పంచాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామన్నారు. జగ్జీవన్ రామ్ భవన్ లో గురుకుల విద్యార్థులకు అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు భట్టి.

►ALSO READ | ఆర్జీయూకేటీ బాసర అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదని..తాము వచ్చాక ఏడాదిలోనే 59 వేల ఉద్యోగాలిచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.   ఉన్నత శిఖరాలకు చేరులంటే చదువు ఒక్కటే మార్గం అని చెప్పారు. కార్పొరేట్ కు ధీటుగా యంగ్ ఇండియా స్కూళ్లు నిర్మిస్తామన్నారు. అన్నా అని పిలిస్తే అందుబాటులో ఉంటానన్నారు రేవంత్.