
- నోటిఫికేషన్ విడుదల చేసిన వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్
ట్రిపుల్‌ఐటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు బాసర ఆర్‌జీయూకేటీ (RGUKT Basara) అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ ట్రిపుల్ఐటీల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.బుధవారం (మే 28) ఆర్జీయూకేటీ బాసర అడ్మిషన్ నోటిఫికేషన్ ను వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఓయస్డి ప్రాఫెసర్ మురళీ దర్శన్, కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్, కో కన్వీనర్ డాక్టర్ దేవరాజు, అసోసియేట్ డీన్ డాక్టర్ విటల్, మంతపురి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
2008లో ప్రారంభించిన గ్రామీణ పేద విద్యార్థులకోసం ఈ విశ్వవిద్యాలయం సాంకేతిక విద్యను అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. తదనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నామని తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పేద విద్యార్థులు పొందుతున్నారని వీసీ తెలిపారు. నోటిఫికేషన్ వివరాలకొరకు www.rgukt.ac.in వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రవేశ షెడ్యూల్‌తో పాటు ఇతర వివరాలను అందులో వెల్లడించనున్నారు. తెలంగాణలో 10వ తరగతి పాసైన విద్యార్థులకు ఇది మంచి అవకాశం.
►ALSO READ | ఉద్యోగాల భర్తీని అడ్డుకునే వాళ్లను నిలదీయాలి : సీఎం రేవంత్
గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాసైన విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులు.10వ తరగతి మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ముగిశాక కౌన్సెలింగ్‌కు కాల్ లెటర్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.