వారంలోగా అన్ని శాఖల్లో ఈ- ఆఫీసు

వారంలోగా అన్ని శాఖల్లో ఈ- ఆఫీసు

అధికారులను ఆదేశించిన సీఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 డిపార్ట్మెంట్లలో ఈ- ఆఫీసును అమలు చేస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. మిగిలిన వాటిలో వారంలోగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆఫీసుల్లో సమర్ధవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి ఈ-ఆఫీస్ ను ప్రారంభించినట్లు సీఎస్ చెప్పారు. సోమవారం బీఆర్ కే భవన్ లోని సెక్రటేరియట్ లోని 8 శాఖలు, హెచ్ వోడీలలోని 2 శాఖల్లో ఈ-ఆఫీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఈ-ఆఫీసు ద్వారా పారదర్శకంగా , బాద్యతాయుతంగా, వేగంగా ఫైల్స్ ప్రాసెస్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. ఎక్కడి నుంచైనా పని చేయవచ్చని చెప్పారు. సెక్రటేరియట్ లోని హెల్త్, ప్లానింగ్, లేబర్, బీసీ సంక్షేమం, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ, మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, హోం శాఖలతో పాటు పీసీబీ, వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాలలో ఈ- ఆఫీసును ఆయన ప్రారంభించారు.

For More News..

రామునికి నవరత్నాల వస్త్రాలు.. కుట్టింది చిన్న టైలర్ షాపులోనే..

జైలు ముందు పేలిన కారు బాంబు.. 29 మంది మృతి

మోడీ బాగా పనిచేస్తున్నరు.. సింగర్ లతా మంగేష్కర్ ట్వీట్

3 వారాల్లో రూ. 1.05 కోట్ల విరాళం సేకరించిన హైదరాబాద్ విద్యార్థులు