వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా స్కూళ్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టేశారు

వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా స్కూళ్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టేశారు

హైదరాబాద్ లో  ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. సికింద్రాబాద్ లో  మత్తుమందు  తయారీ ఫ్యాక్టరీ గుట్టురట్టు చేసింది ఈగల్ టీం. పాత స్కూల్ లో  ల్యాబ్ ను ఏర్పాటు చేసుకొని అల్ఫాజోలం  తయారు చేస్తున్న చేస్తోంది ముఠా. పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మత్తు మందు తయారీ చేస్తున్నారు. తయారు చేసిన మత్తు మందును తీసుకెళ్తుండగా ఈగల్‌ టీం పట్టుకుంది.  ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.   కోటికి పైగా అల్ఫా జోలం సీజ్ చేశారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ టీం అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.   ఓ స్కూల్ డైరెక్టర్ ఈ కేసులో ఉన్నట్లు సమాచారం. 

రెండు రోజుల క్రితం సంగారెడ్డిలో ఓ అల్ఫా జోలం తయారీ కేంద్రంపై తనిఖీలు చేసిన ఈగల్ అధికారులు.. 50 లక్షల విలువచేసే ఆల్ఫా జోలం సీజ్  చేశారు.  ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.  సెప్టెంబర్ 13న   బోయిన్ పల్లిలో  అల్ఫాజూలం కేంద్రంపై సోదాలు చేస్తున్నారు  ఈగల్ టాస్క్ ఫోర్స్ అధికారులు.

ఇటీవల సెప్టెంబర్ 6న మేడ్చల్‌‌‌‌ జిల్లా చర్లపల్లిలో భారీ డ్రగ్స్‌‌‌‌ తయారీ యూనిట్‌ ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ‌‌‌ గుట్టు రట్టు చేసిన సంగతి తెలిసిందే.. ఫార్మా కంపెనీల ముసుగులో అతి ప్రమాదకర మెఫెడ్రోన్‌‌‌‌, మోలీ, ఎక్స్‌‌‌‌టసీ లాంటి డ్రగ్స్‌‌‌‌ను సప్లయ్ చేస్తున్న రెండు కంపెనీలపై  ముంబై క్రైమ్ డిటెక్షన్‌‌‌‌ యూనిట్‌‌‌‌ పోలీసులు  దాడులు చేశారు. 5 కిలోల 968 గ్రాముల మెఫెడ్రోన్‌‌‌‌(ఎండీ), 35,500 లీటర్ల సాల్వెంట్ సహా ఇతర కెమికల్స్‌‌‌‌, 19 బాక్సుల్లో నిల్వ చేసిన 950 కిలోల మిథైలిన్‌‌‌‌ డైక్లోరైడ్‌‌‌‌ (ఎండీసీ) పౌడర్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు.  దీని విలువ రూ.12.58 కోట్లుగా నిర్ధారించారు. ఈ కెమికల్స్‌‌‌‌తో రూ.12వేల కోట్ల విలువ చేసే మెఫెడ్రోన్‌‌‌‌ డ్రగ్‌‌‌‌ తయారు చేయవచ్చని గుర్తించారు. కంపెనీ నిర్వాహకులను ఇద్దరిని అరెస్ట్‌‌‌‌ చేసి ట్రాన్సిట్ వారెంట్‌‌‌‌పై మహారాష్ట్రలోని థానేకు తరలించారు. గత నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌‌‌‌లో చర్లపల్లిలో పట్టుబడిన ఇద్దరుసహా మొత్తం13 మందిని అదుపులోకి తీసుకున్నారు.