నేటి నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు

నేటి నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు

ఇంజినీరింగ్‌లో 19,380 కొత్త సీట్లు
ఉత్తర్వు లు జారీ చేసిన స్పెషల్ సెక్రటరీ

హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్ కాలేజీల గుర్తింపు, కొత్త కోర్సులు, సీట్లపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. జేఎన్టీయూ పరిధిలో 2020–21 విద్యా సంవత్సరానికి గాను కొత్తగా19,380 సీట్లను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆదివారం నుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. సెప్టెంబర్​లో జరిగిన ఎంసెట్​(ఇంజినీరింగ్ స్ర్టీమ్)కు1,19,183 మంది హాజరయ్యారు. వీరిలో 89,734 (75.29 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. వీరికి ఈ నెల12 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కాలేజీల అఫిలియేషన్, కొత్త కోర్సులు, సీట్లపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో వాయిదా వేశారు. సోమవారం (ఈ నెల18) నుంచి ఈ ప్రాసెస్ మొదలవుతుందని తాజాగా ప్రకటించారు. శనివారం రాత్రి10 గంటల వరకూ కాలేజీలు, సీట్లపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో స్టూడెంట్లకు టెన్షన్​పడ్డారు. చివరకు స్పెషల్ చీఫ్​సెక్రటరీ చిత్రారాంచంద్రన్ ఉత్తర్వులు జారీచేశారు. దీంట్లో జేఎన్టీయూ పరిధిలోని157 కాలేజీల్లో18,210 కొత్త సీట్లు ఇవ్వగా, ఓయూ పరిధిలోని15 కాలేజీల్లో1,170 సీట్లు పెంచారు. కాగా, జేఎన్టీయూ పరిధిలోఈ ఏడాది 6 కొత్త కోర్సులకు ఆ వర్సిటీ అనుమతించింది. అయితే ఆయా కాలేజీల్లో డిమాండ్ లేని కోర్సుల సీట్లను మేనేజ్మెంట్లు ఏఐసీటీఈ, జేఎన్టీయూకు సరెండర్ చేశారు. వాటి స్థానంలో కొత్త సీట్లను తీసుకున్నారు.

For More News..

దసరాకు సగం ‘ధరణి’ సిద్ధం

స్టూడెంట్స్‌‌ టెన్షన్ పడొద్దు కొత్త సర్టిఫికెట్లు ఇస్తం

అవసరమైతే ఇండ్లకే వెళ్లి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేస్తం