EAMCET: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

EAMCET:  తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్  విడుదల

తెలంగాణ ఎంసెట్, పీజీ సెట్ షెడ్యూల్  విడుదల చేస్తూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  మే 7 నుంచి ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 3 నుండి ఏప్రిల్ 4  ఆన్ లైన్ లో అప్లికేషన్స్ స్వీకరించనున్నారు.  లేట్ ఫీతో మే 2 వరకు అప్లికేషన్స్ తీసుకోనున్నారు.  ఏప్రిల్ 30న హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 7 నుండి 11 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి.

మే 29 నుంచి జూన్‌ 1 వరకు పీజీసెట్ ఈ పరీక్షలను  జరగనున్నాయి. మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. లేట్ ఫీతో మే 24 వరకు అప్లికేషన్స్ తీసుకోనున్నారు.  మే 21వ తేదీ నుండి ఆన్లైన్ లో హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.