ఉప్పల్, వెలుగు: టీజీ ఎప్‌సెట్-2026 ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగం నుంచి ఉప్పల్ చిల్కానగర్కు చెందిన మల్లాది రుషి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ప్రైవేట్ ఉద్యోగి కొండల్ రెడ్డి కుమార్తె అయిన రుషి.. ఈ పరీక్షలో 160 మార్కులకు గానూ 156.64 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. భవిష్యత్తులో ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) విభాగంలో రాణించడమే తన లక్ష్యమని రుషి తెలిపింది. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన రుషిని పలువురు అభినందించారు
