కొరియన్ కనకరాజు మూవీలో పెదనాన్నలా డ్యాన్స్ ట్రై చేశా: వరుణ్ తేజ్

కొరియన్ కనకరాజు మూవీలో పెదనాన్నలా డ్యాన్స్ ట్రై చేశా: వరుణ్ తేజ్

వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో  యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్లపై  రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ  మూవీ  ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తాజాగా ఈ చిత్రం నుంచి ‘రాసా గుమ్మాడి’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను అనంతపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా షూటింగ్ మొత్తం అనంతపురంలోనే జరిగింది. అందుకే ఫస్ట్ ఈవెంట్‌‌ ఇక్కడే చేశాం. 

పెదనాన్న గారిలా డ్యాన్స్ చేయాలని ట్రై చేశా. ఈ సాంగ్ షూటింగ్‌‌ చాలా ఎంజాయ్ చేశా. సినిమా కూడా అందర్నీ ఎంటర్‌‌‌‌టైన్ చేస్తుంది’ అని చెప్పాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ ‘ఈ కథ అనంతపురం బ్యాక్‌‌డ్రాప్‌‌లోనే ఉంటుంది. వరుణ్ తేజ్ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. వరుణ్ తేజ్, సత్య కామెడీని ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. ఈ సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్‌‌గా ఉన్నామని నిర్మాత రాజీవ్ రెడ్డి అన్నారు.