ఎప్పుడూ చూడని కొత్త ప్రేమకథతో చెన్నై లవ్ స్టోరీ..

ఎప్పుడూ చూడని కొత్త ప్రేమకథతో చెన్నై లవ్ స్టోరీ..

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్‌‌స్టోరీ’.   సాయి రాజేష్ కథను అందిస్తూ ఎస్‌‌కేఎన్‌‌తో కలిసి  నిర్మించారు.  రవి నంబూరి దర్శకత్వం వహించాడు.  జులై 24న సినిమా విడుదల కానుంది. శనివారం ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ట్రైలర్‌‌‌‌లోని భావోద్వేగాలను  గమనిస్తే ఇది డెఫనెట్‌‌గా హిట్ అయ్యే సినిమా అనే ఇంప్రెషన్ కలుగుతోంది.  

కిరణ్ ఎంతో నేచురల్‌‌గా పెర్ఫార్మ్ చేశాడు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు.    మరో అతిథిగా హాజరైన నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ ‘ఈ మూవీ నుంచి ఏ కంటెంట్ రిలీజ్ చేసినా అది మంచి రీచ్ తెచ్చుకుంది.  నానిని నేచురల్ స్టార్ అని పిలుస్తాం. అలాగే కిరణ్‌‌ను ఒరిజినల్ స్టార్ అని పిలవాలని ఉంది.  

మా బ్యానర్‌‌‌‌లో నెక్స్ట్ కిరణ్ చేయబోయే సినిమాలో ఒరిజినల్ స్టార్ అని వేస్తాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఎప్పుడూ తెరపై చూడని ఒక కొత్త ప్రేమ కథను ఇందులో చూస్తారు. సినిమా చూసి బయటకు వచ్చాక మా మూవీ ట్రాన్స్‌‌లోనే ఉండిపోతారు’ అని చెప్పాడు. 

కాంప్లికేటెడ్‌‌గా ఉండే   స్వచ్ఛమైన ప్రేమకథే ఈ చిత్రమని హీరోయిన్ శ్రీగౌరీ ప్రియ చెప్పింది.  ట్రైలర్‌‌‌‌లో చూసింది చాలా తక్కువని, సినిమాలో ఎన్నో సర్‌‌‌‌ప్రైజెస్ ఉంటాయని   డైరెక్టర్ రవి నంబూరి అన్నాడు.  ట్రైలర్‌‌‌‌కు వంద రెట్లు సినిమా ఉంటుందని  గ్యారెంటీ ఇచ్చారు నిర్మాతలు ఎస్ కేఎన్, సాయి రాజేష్,  నటులు త్రిగుణ్,  నరేష్, సిరి హన్మంతు,  మహేందర్, పూజ, నవీన్, కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని పాల్గొన్నారు.