Maharashtra : బీఆర్ఎస్ సభ.. MNS నేతల అరెస్టు

Maharashtra : బీఆర్ఎస్ సభ.. MNS నేతల అరెస్టు

మహారాష్ట్రలోని నాందేడ్​లో బీఆర్ఎస్  భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఎంఎన్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ సభను అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ ప్రకటించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాబ్లీ ప్రాజెక్టు అంశంలో కేసీఆర్ స్పష్టమైన వైఖరి తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. బాబ్లీ నీటి పంపకాల్లో మహారాష్ట్రకి అన్యాయం జరుగుతోందని ఎంఎన్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకు స్పష్టమైన సమాధానం చెప్పిన తర్వాతే మహారాష్ట్రలో కేసీఆర్ అడుగుపెట్టాలని అన్నారు. ఎలాగైనా బీఆర్ఎస్ సభను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ సభకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.