- గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ఎన్.వాణి
పద్మారావునగర్,వెలుగు: వినికిడి సమస్యలను చిన్నారుల్లో ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స అందించి సమస్య పరిష్కరించవచ్చని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌డాక్టర్‌ఎన్.వాణి తెలిపారు. గాంధీ దవాఖానలోని ఈఎన్టీ విభాగం సెమినార్‌హాల్‌లో బుధవారం మీనాక్షి వెంకట్రామన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ శిబిరానికి ఆమె హాజరయ్యారు. ఈఎన్టీ విభాగంలో ఇప్పటివరకు 26 మంది చిన్నారులకు కాక్లియర్ ఇంప్లాంట్శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని, మరో 26 మంది ప్రీ-ఇంప్లాంట్ థెరపీలో ఉన్నారని తెలిపారు.
ఈఎన్టీ విభాగం ప్రొఫెసర్, హెచ్‌వోడీ డాక్టర్ భూపేందర్‌సింగ్ రాథోడ్మాట్లాడుతూ.. కాక్లియర్ఇంప్లాంట్కు ముందు, తర్వాత కూడా థెరపీ అత్యంత కీలకమన్నారు. ఫౌండేషన్ ద్వారా నెలకు 25 రోజుల పాటు ఇచ్చే స్పీచ్థెరపీతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఐదుగురు చిన్నారులకు డిజిటల్ వినికిడి యంత్రాలను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఎంవోలు, గాంధీ ఆసుపత్రి ఈఎన్టీ విభాగం అసిస్టెంట్ప్రొఫెసర్లు, మీనాక్షి వెంకట్రామన్ ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ సేతురామన్, డైరెక్టర్ మురళి నటరాజన్, ఆడియోలాజిస్ట్లు పాల్గొన్నారు.
