అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.8గా రికార్డైంది. న్యూయార్క్ సిటీకి పశ్చిమాన 40 మైళ్ల దూరంలో ఉన్న న్యూజెర్సీకి సమీపంలో భూకంప కేంద్రంగా భూమి కంపిచడం ప్రారంభమైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎక్స్ వేదిగా తెలిపింది.
న్యూజెర్సీ నుండి లాంగ్ ఐలాండ్ వరకు భూకంపం కారణంగా బిల్డింగులు కంపించాయి. నగరవాసులు భయాందోళనకు గురైయ్యారు. ఎలాంటి ఆస్తినష్టం ప్రాణ నష్టం జరగలేదు.