హుజురాబాద్‌లో ఈటల పాదయాత్ర ప్రారంభం..

హుజురాబాద్‌లో ఈటల పాదయాత్ర ప్రారంభం..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ‘ప్రజా దీవెన యాత్ర’ పేరుతో తలపెట్టిన పాదయాత్ర ప్రారంభమైంది. ఇందుకోసం ఆయన హుజురాబాద్ నుంచి ఈ ఉదయమే బత్తివాని పల్లెకు చేరారు. హుజురాబాద్‌లో ఇంటి నుంచి బయలుదేరుతున్న ఈటలకు.. ఆయన భార్య జమున బొట్టు పెట్టి, హారతి ఇచ్చారు. కమలాపురం మండలం బత్తివాని పల్లె నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు చేసిన అనంతరం ఈటల పాదయాత్రను ప్రారంభించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి జెండా ఊపారు. ఈటల వెంట బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ ఉన్నారు. పాదయాత్రంలో భాగంగా ఈ రోజు శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాముల పేట, అంబలలో పాదయాత్ర జరగనుంది. పాదయాత్రం అనంతరం ఈటల ఈ రోజు రాత్రి అంబాలలో బస చేస్తారు. మొత్తం 23 రోజుల పాటు 127 గ్రామాల మీదుగా 270 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది.