మహిళా అధికారిణిపై ఎర్రబెల్లి సంస్కార హీనంగా మాట్లాడిండు

మహిళా అధికారిణిపై ఎర్రబెల్లి సంస్కార హీనంగా మాట్లాడిండు

హుజురాబాద్ లో సర్కార్ అధికార దుర్వినియోగం ఎక్కువైందన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. రంగనాయకసాగర్ లో బేరాలు జరుగుతున్నాయన్నారు. హరీశ్ రావు కుల సంఘాలతో బేరాలు చేస్తున్నారన్నారు. ఆర్డీఓ నేతృత్వంలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయన్నారు. పెద్ద పెద్ద ఊర్లలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారన్నారు. ఓట్లు వేయరనుకున్న వాళ్ల ఓట్లు తీసేస్తున్నారన్నారు. ఒక్కొక్క ఇంట్లో 30,40, ఓట్లు నమోదు చేయిస్తున్నారన్నారు. హుజురాబాద్ మున్సిపల్ ఛైర్మన్ రాధిక ఇంట్లో 34 ఓట్లు ఉన్నాయంటూ ఆధారాలు చూపెట్టారు ఈటల. ఓట్లు తొలగించకుండా కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు.దొంగ ఓట్లపై కార్యకర్తలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. 

బాధ్యతలు మరిచి బానిసల్లాగా అధికారులు పనిచేయొద్దన్నారు.ఉద్యమ ద్రోహులందరూ కేసీఆర్ పక్కన కూర్చున్నారన్నారు.ఉద్యమ కారులంతా టీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారన్నారు. ఓటుకు లక్ష ఇచ్చినా ప్రజలే టీఆర్ఎస్ కు ఓటేసే పరిస్థితి లేదన్నారు. కమలాపూర్ లో ఓ మహిళా అధికారిణిపై ఓ మంత్రి సంస్కార హీనంగా మాట్లాడారన్నారు. మంత్రులకు మతి భ్రమించి కల్లుతాగిన కోతుల్లాగా మాట్లాడుతున్నారని.. ఇదంతా సీఎం ఆదేశాలతోనే మాట్లాడుతున్నారా?అని అన్నారు.హుజురాబాద్ లో ప్రచారానికి వస్తున్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఫించన్లు, కులసంఘాల భవనాలు ఇచ్చారా? ఇక్కడ ఇస్తున్న హామీలన్నీ మీ దగ్గర నెరవేర్చారా? అని ప్రశ్నించారు. తనకు ఓటేస్తే పథకాలు అందవని చెప్పడం మీ తాతా జాగీరా? అని అన్నారు