కేసీఆర్ ప్రతిష్ట, గౌరవం పాతాళానికి పడిపోయింది

కేసీఆర్ ప్రతిష్ట, గౌరవం పాతాళానికి పడిపోయింది

సీఎం కేసీఆర్ ప్రతిష్ట, గౌరవం పాతాళానికి పడిపోయిందన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. తన రాజీనామాతో ప్రజలకు మేలే జరిగిందన్నారు.  హుజురాబాద్ ఎన్నికల భయంతో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 8 ఏళ్లలో దళితులు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. దళితబంధుకు అవసరమైన లక్షా 70 వేల కోట్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలన్నారు ఈటల. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఓపెన్ డిబెట్ కు సిద్ధమని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, దగ్గరి వాళ్లు ఎవరు చెప్పినా పట్టించుకోని క్యారెక్టర్ కేసీఆర్ ది అన్నారు. ఇండియా టుడే సర్వేలో ఆయనకిచ్చిన స్థానం చూసైనా పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. తన రాజీనామా వల్ల ఇన్ని ఫలితాలు వస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. హుజురాబాద్ లో మీరు మండల స్థాయిలో కాదు.. ఊరూరికి తిరిగినా.. మీకు డిపాజిట్ కూడా రాదన్నారు.