పాస్తా ఇలా తింటే చచ్చిపోతారట..

పాస్తా ఇలా తింటే చచ్చిపోతారట..

మనలో కొందరికి మిగిలిపోయిన ఆహారాన్ని తినడం అలవాటుగా ఉంటుంది. ఆహారం వృధా కాకుండా ఉండేందుకు వేడి చేయడం ద్వారా గానీ లేదా యాజ్ ఇట్ ఈజ్ గా తింటుంటారు. అయితే ఇలాంటి నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని ఇంటర్నెట్ లో ప్రచారం సాగుతోంది.

పాస్తా అంటే గోధుమ పిండి, నీళ్లు, కోడి గుడ్లు కలిపి షీట్లు లేదా రకరకాల ఆకారాల్లో తయారి చేసే ఒకరకమైన ఆహారం.. దీనిని విదేశాల్లో చాలా ఇష్టంగా తింటారు.

అయితే నిల్వ ఉంచిన పాస్తా తినడం వల్ల 20 యేళ్ల యువకుడు చనిపోయిన విషాద ఘటనకు సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెల్జియంలోని బ్రెస్సెల్స్ కు చెందిన ఓ విద్యార్థి .. పని బిజీలో వారానికి సరిపడా ఆహారాన్ని తయారు చేసుకోవడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా పాస్తా తయారు చేసి కంటైనర్లలో నిల్వ ఉంచాడు. అయితే ఫ్రిజ్ లో ఉంచాల్సిన పాస్తాను.. ఐదు రోజుల పాటు గది ఉష్ణోగ్రతల వద్దే నిల్వ ఉంచాడు. 

మొదటి నాలుగు రోజుల పాటు విద్యార్థి పాస్తాను బాగానే తిన్నాడు.. అందులో ఎటువంటి మార్పు లేదు. ఐదో రోజు తెలియని రుచిని పాస్తాలో గమనించాడు. అది కొత్త బ్రాండ్ సాస్ ఉపయోగించడం వల్ల వచ్చింది అనుకున్నాడు. మరుసటి రోజు తీవ్రమైన వికారం, కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు అయ్యాయి.  ఉపశమనం కోసం కొన్ని నీళ్లు తీసుకొని నిద్రించాడు. 

ఆ తర్వాత రోజు తల్లిదండ్రులు నిద్ర లేచేసరికి అతడు చనిపోయి ఉన్నాడు. నిల్వ ఉంచిన పాస్తా తిన్న 10 గంటల తర్వాత ఆ విద్యార్థి మృతి చెందినట్లు గుర్తించారు.మరణించిన వ్యక్తి సెంట్రిలోబ్యులర్ లివర్ నెక్రోసిస్‌తో బాధపడుతున్నారని ఇది అవయవాలను పూర్తి పనిచేయకుండా చేస్తుందని డాక్టర్లు నిర్దారణకు వచ్చారు. 

నిల్వ ఉంచిన పాస్తా, సాస్ నమూనాలను ఫుడ్-బోర్న్ వ్యాప్తికి సంబంధించిన నేషనల్ రిఫరెన్స్ లాబొరేటరీకి పంపగా.. పాస్తాలో బాసిల్లస్ సెరియస్  తేలింది అని స్థానిక మీడియా తెలిపింది.