ఆర్టీసీ సమ్మెకు ఈబీసీల మద్దతు

ఆర్టీసీ సమ్మెకు ఈబీసీల మద్దతు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఈబీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇస్తున్నట్లు సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్​రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్​ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ విలీనం అంశంపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తోందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొనాలని ఈబీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు.