- 11దాకా విడుదల చేయొద్దన్న ఈసీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎగ్జిట్ పోల్, ఒపీనియన్ పోల్ ఫలితాలు గురువారం ఉదయం 7 గంటల నుంచి ఈ నెల 11న సాయంత్రం 6.30 గంటల వరకు వెల్లడించకూడదని ఎన్నికల అధికారులు సూచించారు. బిహార్‌లో గురువారం తొలి విడత, 11న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.
బిహార్ రెండో విడత ఎలక్షన్లతోపాటు దేశంలోని 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కారణంగా బిహార్ ఎన్నికలపై ఎఫెక్ట్ పడకుండా కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఫలితాలు విడుదలకు బ్రేక్ వేసింది. ఎవరైనా ప్రకటిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
