11 రాజ్యసభ  స్థానాలకు ఎన్నికలు..యూపీలో 10, ఉత్తరాఖండ్‌‌‌‌ లో ఒక సీటు 

11 రాజ్యసభ  స్థానాలకు ఎన్నికలు..యూపీలో 10, ఉత్తరాఖండ్‌‌‌‌ లో ఒక సీటు 
  •    యూపీలో 10, ఉత్తరాఖండ్‌‌‌‌లో ఒక సీటు 
  •     4 రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ స్థానాలకూ ఈసీ నోటిఫికేషన్  


న్యూఢిల్లీ: యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 11 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ఉత్తరప్రదేశ్‌‌‌‌లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్‌‌‌‌లో ఒక స్థానం ఉన్నాయి. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, బీఎల్ వర్మ, సమాజ్‌‌‌‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీకి చెందిన రామ్‌‌‌‌జీ, మరో ఆరుగురి పదవీకాలం నవంబర్ 25న పూర్తి కానుంది. ఉత్తరాఖండ్‌‌‌‌కు చెందిన నరేశ్ బన్సల్ పదవీకాలం కూడా అదే తేదీన ముగియనుంది. వీటితోపాటు పశ్చిమ బెంగాల్‌‌‌‌లో ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి కూడా ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రుక్మిణి మల్లిక్ రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచే ప్రారంభమైంది. అన్ని స్థానాలకు అక్టోబర్16న పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌‌‌‌లో 11 ఎమ్మెల్సీ స్థానాలు, బిహార్‌‌‌‌లో 8, మహారాష్ట్రలో 5, కర్నాటకలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను కూడా ఈసీ ప్రకటించింది. వీటికి కూడా నామినేషన్ల స్వీకరణ మంగళవారం నుంచే ప్రారంభం కాగా, అక్టోబర్ 6 వరకూ చివరి గడువు ఉంది. అక్టోబర్ 9 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 23న పోలింగ్ నిర్వహించి, 27న ఫలితాలు ప్రకటించనున్నారు.