ఆర్టీసీ యూనియన్‌‌‌‌‌‌‌‌ గుర్తుపై జోక్యం చేసుకోలేం : హైకోర్టు

ఆర్టీసీ యూనియన్‌‌‌‌‌‌‌‌ గుర్తుపై జోక్యం చేసుకోలేం : హైకోర్టు
  • హైకోర్టు స్పష్టం  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున గుర్తు కేటాయింపుపై ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. గతంలో కేటాయించిన విల్లు-బాణం గుర్తు స్థానంలో నిచ్చెన గుర్తును కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఆర్టీసీ మజ్దూర్‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసింది. 

పిటిషన్‌‌‌‌‌‌‌‌పై జస్టిస్‌‌‌‌‌‌‌‌ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున గుర్తు కేటాయింపు విషయంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. అనంతరం పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కొట్టివేశారు.