వాస్తవాలను ఎదుర్కొనేలా..సీఎంఏలను తీర్చిదిద్దుతాం: ఐసీఎంఏ అధ్యక్షుడు చిత్తరంజన్‌‌

వాస్తవాలను ఎదుర్కొనేలా..సీఎంఏలను తీర్చిదిద్దుతాం: ఐసీఎంఏ అధ్యక్షుడు చిత్తరంజన్‌‌

న్యూఢిల్లీ: వాస్తవ వ్యాపార సవాళ్లను అధిగమించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాస్ట్ అండ్ మేనేజ్‌‌మెంట్ అకౌంటెంట్ (సీఎంఏ) లను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని  ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) అధ్యక్షుడు చిత్తరంజన్ ఛటోపాధ్యాయ్  తెలిపారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌‌లోని ఎఫ్‌‌టీసీసీఐలో ఐసీఎంఏఐ ఆధ్వర్యంలో ‘అడ్వాన్స్‌‌డ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్’ (ఏఎస్టీపీ) ముగింపు వేడుక జరిగింది. 

విద్యా పరిజ్ఞానానికి, కార్పొరేట్ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడు బ్యాచ్‌‌లలో 425 మందికి సాఫ్ట్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూలు, బడ్జెటింగ్ అంశాల్లో ఆచరణాత్మక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేశారు. ఐసీఎంఏఐ ‘విజన్ 2047’, కార్పొరేట్ మిత్ర పథకాల ద్వారా ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు అందిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని నేతలు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ మూర్తి, వెంకట రాంబాబు పాల్గొన్నారు.