గుల్వీర్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ పతకాలు.. ఆసియా క్రీడల్లో అరుదైన రికార్డు

గుల్వీర్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ పతకాలు.. ఆసియా క్రీడల్లో అరుదైన రికార్డు

ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ అథ్లెట్‌‌‌‌‌‌‌‌ గుల్వీర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ఈ క్రీడల్లో హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ పతకాలు సాధించాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌ 5 వేల మీటర్ల పరుగులో గుల్వీర్‌‌‌‌‌‌‌‌ 13:32.75 సెకన్ల టైమింగ్‌‌‌‌‌‌‌‌తో కాంస్య పతకాన్ని సాధించాడు. అంతకుముందు మెన్స్‌‌‌‌‌‌‌‌ 1500 మీటర్లు, 10 వేల మీటర్లలో గుల్వీర్‌‌‌‌‌‌‌‌ రజతాలను సొంతం చేసుకున్నాడు.

దీంతో ఒకే కాంటినెంటల్‌‌‌‌‌‌‌‌ క్రీడల్లో ట్రాక్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ విభాగాల్లో ఇండియా తరఫున మూడు పతకాలు సాధించిన రెండో పురుష అథ్లెట్‌‌‌‌‌‌‌‌గా గుల్వీర్‌‌‌‌‌‌‌‌ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా నాలుగో అథ్లెట్‌‌‌‌‌‌‌‌గా నిలిచా డు. లావీ పింటో (1951 న్యూఢిల్లీ, 3 పతకాలు), పీటీ ఉష (1986 సియోల్‌‌‌‌‌‌‌‌, 4 పతకాలు), కేఎం బీనామోల్‌‌‌‌‌‌‌‌ (2002 బుసా న్‌‌‌‌‌‌‌‌, 3 పతకాలు) ముందున్నారు. మరోవైపు విమెన్స్‌‌‌‌‌‌‌‌ హ్యామర్ త్రోలో, తన్యా చౌదరి 65.35 మీటర్ల దూరంతో నాలుగు, అనుష్క యాదవ్ 64.56 మీటర్లతో ఐదో స్థానంతో సరిపె ట్టుకుంది. మెన్స్‌‌‌‌‌‌‌‌ పోల్ వాల్ట్‌‌‌‌‌‌‌‌లో దేవ్ కుమార్ మీనా 5.50 మీటర్ల ప్రదర్శనతో జాతీయ రికార్డును నెలకొల్పినప్పటికీ, ఏడో ప్లేస్‌‌‌‌‌‌‌‌కే పరిమితమ య్యాడు. 800 మీటర్ల పరుగు పందెంలో పూజా ఒల్లా,  మహ మ్మద్ అఫ్జల్ వరుసగా ఏడు, ఎనిమిది  స్థానాల్లో నిలిచారు.