Golden Bhagyam: ‘గోల్డెన్ భాగ్యం’ గ్లింప్స్ రివ్యూ.. సత్య, యోగిబాబు కాంబోపై టాక్ ఇదే

Golden Bhagyam: ‘గోల్డెన్ భాగ్యం’ గ్లింప్స్ రివ్యూ.. సత్య, యోగిబాబు కాంబోపై టాక్ ఇదే

ఒకరు కోలీవుడ్ టాప్ కమెడియన్.. మరొకరు టాలీవుడ్ క్రేజీ కమెడియన్.  హాస్య నటులుగా వీరికి  ప్రత్యేకమైన పాపులారిటీ  ఉంది.  తాజాగా వీరిద్దరు కలిసి ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబో తున్నారు. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, నాగార్జున రెడ్డితో కలిసి  నిర్మిస్తున్నాడు.

మంగళవారం మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేస్తూ స్పెషల్ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ఇది తెలుగు, తమిళ భాషలను కలిపి, రెండు ఇండస్ట్రీలకు చెందిన పాపులర్ యాక్టర్స్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కుతున్న ‘తెలుమిళ్‌‌‌‌‌‌‌‌’ (తెలుగు, తమిళ్‌‌‌‌‌‌‌‌) ప్రాజెక్ట్ అంటూ గ్లింప్స్ విడుదల చేయడం ఫన్నీగా ఉంది. వీడియోలో సత్య, యోగిబాబు వైట్ అండ్ వైట్ ట్రెడిషనల్ డ్రెస్‌‌‌‌‌‌‌‌లో  కనిపించారు. ఇందులో లవ్‌‌‌‌‌‌‌‌,  క్రైమ్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని దర్శకుడు చెబుతూ..ఫైనల్‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రానికి  ‘గోల్డెన్ భాగ్యం’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేశారు.

టైటిల్‌తో పాటు సత్య, యోగిబాబు కాంబినేషన్‌పై కూడా ఆడియన్స్‌లో ఆసక్తి పెరుగుతోంది. ఇద్దరు కమెడియన్లు కలిసి కనిపించడంతో కామెడీ ట్రాక్ ఎలా ఉండబోతుందోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గ్లింప్స్‌లో కనిపించిన ఇద్దరి లుక్, కాంబినేషన్, ‘తెలుమిళ్’ కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

ముఖ్యంగా సత్య–యోగిబాబు కలిసి చేసే కామెడీకి థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ప్రస్తుతానికి గ్లింప్స్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. జయశ్రీ, అధిరాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సుదర్శన్, కిశోర్ తిరుమల, రోహిణి, తనికెళ్ల భరణి, సునీల్ రెడ్డి   కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం అందిస్తున్నాడు.