IND vs ENG 2025: టీమిండియాతో ఐదో టెస్టు.. స్క్వాడ్ ప్రకటించిన ఇంగ్లాండ్

IND vs ENG 2025: టీమిండియాతో ఐదో టెస్టు.. స్క్వాడ్ ప్రకటించిన ఇంగ్లాండ్

ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి నాలుగు టెస్టులు ఐదో రోజు చివరి సెషన్ వరకు వెళ్లడం విశేషం. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే.. ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన రెండో టెస్టులో ఇండియా భారీ విజయాన్ని అందుకుంది. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ గెలిచి సిరీస్ లో 2-1 తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇటీవలే ముగిసిన మాంచెస్టర్ టెస్ట్ డ్రా గా ముగిసింది. ఈ సిరీస్ లో జరగబోయే చివరి టెస్ట్ కోసం ఇరు జట్లు కసరత్తులు చేస్తున్నాయి. టీమిండియాతో జరగబోయే చివరిదైన ఐదో  టెస్ట్ కు ఇంగ్లాండ్ తమ స్క్వాడ్ ను ప్రకటించింది.

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) సోమవారం  (జూలై 28) 15 మంది ఆటగాళ్లతో కూడిన ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన స్క్వాడ్ లో కొత్తగా ఫాస్ట్ బౌలర్ జెమీ ఓవర్ టన్ ను అదనంగా చేర్చుకుంది. ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు ఈ నెల 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 4 టెస్ట్ మ్యాచ్ లు జరగగా ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టులో ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. మరోవైపు ఇండియా విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతోంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే 2-1 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ గెలుచుకుంటుంది.

టీమిండియాతో 5వ టెస్ట్ కు ఇంగ్లాండ్ స్క్వాడ్:

బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, లియామ్ డాసన్, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్, జెమీ ఓవర్ టన్.