ఈసెట్ ఎగ్జామ్ వాయిదా..త్వరలోనే కొత్త డేట్

ఈసెట్ ఎగ్జామ్ వాయిదా..త్వరలోనే కొత్త డేట్

ఈ సెట్ ఎగ్జామ్ వాయిదా పడింది. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. త్వరలోనే కొత్త ఎగ్జామ్ డేట్ ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఎంసెట్ పరీక్షలు మాత్రం యదాతధంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో అగ్రిక‌ల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ఎగ్జామ్స్..ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుందని అధికారులు ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. జోరు వానలతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 11, 12, 13 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ క్రమంలోనే 13న జరగాల్సిన ఈ సెట్ పరీక్షను వాయిదా వేశారు.