FIFA: మాజీ చాంపియన్‌ జర్మనీకి ఈక్వెడార్‌‌‌‌ చెక్‌‌‌‌..

FIFA: మాజీ చాంపియన్‌  జర్మనీకి ఈక్వెడార్‌‌‌‌  చెక్‌‌‌‌..

ఈస్ట్‌‌‌‌ రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌:  గ్రూప్‌‌‌‌–ఇలో జరిగిన మరో మ్యాచ్‌‌‌‌లో ఈక్వెడార్‌‌‌‌ 2–1తో మాజీ చాంపియన్‌‌‌‌ జర్మనీకి చెక్‌‌‌‌ పెట్టింది. 2006 తర్వాత ఈక్వెడార్‌‌‌‌ నాకౌట్‌‌‌‌కు చేరడం ఇదే తొలిసారి. నీల్సన్‌‌‌‌ అంగులో (9వ ని), గొంజాలో ప్లాటా (77వ ని) ఈక్వెడార్‌‌‌‌కు గోల్స్‌‌‌‌ అందించగా, జర్మనీ తరఫున లెరాయ్‌‌‌‌ సనే (2వ ని) ఏకైక గోల్‌‌‌‌ చేశాడు.

తొలి రెండు మ్యాచ్‌‌‌‌ల్లో తేలిపోయిన ఈక్వెడార్‌‌‌‌ ఈ పోరులో మాత్రం అసాధారణ పోరాటపటిమను చూపెట్టింది. స్టార్టింగ్‌‌‌‌లో దూకుడుగా ఆడిన జర్మనీ ఫార్వర్డ్స్‌‌‌‌ రెండో నిమిషంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కానీ ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఏడు నిమిషాల తర్వాత అంగులో బంతిని గోల్‌‌‌‌ పోస్ట్‌‌‌‌లోకి పంపి స్కోరును 1–1తో సమం చేశాడు.

ఇక్కడి నుంచి ఇరుజట్లు గోల్స్‌‌‌‌ కోసం తీవ్రంగా శ్రమించాయి. అయితే 77వ నిమిషంలో లభించిన కార్నర్‌‌‌‌ కిక్‌‌‌‌ను కెవిన్‌‌‌‌ రోడ్రిగ్జ్‌‌‌‌ హెడర్‌‌‌‌ ద్వారా ముందుకు నెట్టగా, జర్మనీ గోల్‌‌‌‌ కీపర్‌‌‌‌ మాన్యుయెల్‌‌‌‌ నూయర్‌‌‌‌ను బోల్తా కొట్టించి ప్లాటా ఎడమ కాలితో నెట్‌‌‌‌లోకి పంపాడు. ఆ తర్వాత జర్మనీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజా ఓటమితో జర్మనీ వరుస 11 విజయాలకు బ్రేక్‌‌‌‌ పడింది.