నరేశ్‌ గోయల్‌కు ఈడీ మరో షాక్.. 538 కోట్లు జప్తు

నరేశ్‌ గోయల్‌కు ఈడీ మరో షాక్..  538 కోట్లు జప్తు

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరో షాకిచ్చింది.  మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద ఆయన, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన  రూ. 538.05 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.  జప్తు చేసిన వాటిలో 17 రెసిడెన్షియల్‌ ఫ్లాట్లు, బంగ్లాలు, వాణిజ్య ప్రదేశాలు ఉన్నాయి. 

ముంబైలోని కెనరా బ్యాంక్‌ను మోసగించిన కేసులో నరేశ్‌ గోయల్‌ను 2023 సెప్టెంబర్ 1న ఈడీ అరెస్ట్‌ చేసింది.  జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఇచ్చిన రుణాలను వ్యక్తిగత అవసరాలకు, ప్రైవేటు  రుణాలు తీర్చేందుకు వినియోగించారన్న ఆరోపణలను గోయల్‌ ఎదుర్కొంటున్నారు.  

ప్రస్తుతం   నరేశ్‌ గోయల్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.  తాజాగా నరేశ్‌ గోయల్‌ తో పాటుగా మరో ఐదుగురిపై ఛార్జిషీటు దాఖలు చేసిన ఈడీ.. తాజాగా కొన్ని ఆస్తులను జప్తు చేసింది. గోయల్ విదేశాల్లో వివిధ ట్రస్టులను సృష్టించారని, ఈ ట్రస్టులను ఉపయోగించి స్థిరాస్తులను కొనుగోలు చేశారని ఈడీ పేర్కొంది. అతను భారత్ తో పాటుగా  విదేశాలలో చరాస్తులు,  స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ALSO READ :- కాంగ్రెస్ లో చేరిన వివేక్, కుమారుడు వంశీకృష్ణతో కలిసి పార్టీలో జాయిన్