
కాన్పూర్: పోలీసు ఎదురుకాల్పుల్లో శుక్రవారం చనిపోయిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ప్రారంభించింది. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా దూబే ఫ్యామిలీ మెంబర్స్, అనుచరులకు సంబంధించిన సమాచారాన్ని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల నుంచి ఈడీ తీసుకుంది. మధ్యప్రదేశ్ పోలీసుల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) ఉజ్జయినిని విజిట్ చేయనుంది. కాన్పూర్ నుంచి ఉజ్జయినికి దూబే ఎలా వచ్చాడనే దానిపై విచారణ చేయనున్నారని తెలిసింది. కాగా, దూబే గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరు మెంబర్‌లను యూపీ పోలీసులు శనివారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో అరెస్టు చేశారు. ఓం ప్రకాశ్ పాండే, అనిల్ పాండేగా పోలీసులు వీరిని గుర్తించారు.