వివోపై మొదటి ఛార్జ్‌‌‌‌షీట్‌‌‌‌

వివోపై మొదటి ఛార్జ్‌‌‌‌షీట్‌‌‌‌

న్యూఢిల్లీ :  మనీలాండరింగ్‌‌‌‌కు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వివోపై మొదటి ఛార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ను ఈడీ ఫైల్ చేసింది.   ప్రివెన్షన్‌‌‌‌ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్‌‌‌‌ కింద స్పెషల్ కోర్టులో ఈ ఛార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ ఫైల్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే లావా ఇంటర్నేషనల్ ఎండీ హరి ఓం రాయ్‌‌‌‌ను అరెస్ట్ చేసింది.  చైనీస్‌‌‌‌ నేషనల్స్‌‌‌‌ గంగ్వెన్‌‌‌‌ అలియాస్‌‌‌‌ ఆండ్రూ కూంగ్‌‌‌‌ను, చార్టర్డ్ అకౌంటెంట్లు నితిన్ గార్గ్‌‌‌‌, రాజన్ మాలిక్‌‌‌‌ను  కస్టడిలోకి తీసుకుంది. ఆర్థిక వ్యవస్థను నష్టపరిచేలా, వివో ఇండియా లాభపడేలా ఈ నలుగురు  చర్యలు తీసుకున్నారని ఈడీ పేర్కొంది.

కాగా, మనీ లాండరింగ్‌‌‌‌కు పాల్పడిందని ఈ ఏడాది జులైలో  వివో ఇండియా ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.  చైనీస్ నేషనల్స్  మనీలాండరింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో కొన్ని ఇండియన్ కంపెనీలపై కూడా దాడులు చేసింది. ఏకంగా రూ.62,476 కోట్లను వివో ఇండియా చైనాకు అక్రమంగా పంపిందని తెలిపింది.