
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది సీబీఐ న్యాయస్థానం. ఏప్రిల్ 3వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పిళ్లైకి జైలులో థైరాయిడ్ మెడిసిన్, ఐ డ్రాప్స్, ఇతర దుస్తులు అందించాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఈడీ అధికారులు రామచంద్ర పిళ్లైను తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 6 గంటలకుపైగా అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు ప్రశ్నించారు.ముఖ్యంగా సౌత్ గ్రూప్ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీశారు.
మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ నాలుగు గంటలకు పైనే దాటింది. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలోనే ఆమెను విచారిస్తోంది ఈడీ. అంతకుముందు.. రామచంద్ర పిళ్లైను, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి పశ్నించారు ఈడీ అధికారులు.