దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన టీటీడీ కల్తీ నెయ్యి కేసులో దూకుడు పెంచింది. ఈ కేసు విచారణకు సంబంధించి 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది ఈడీ. అహిల్యానగర్, బికనీర్, డెహ్రాడూన్, ఢిల్లీ, గుంటూరు, ముంబై, రూర్కీల్లో ఈడీ సోదాలు చేపట్టింది.
ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న పోమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్ చావ్డా, అపూర్వ చావ్డా ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. మచీంద్ర శాంతారామ్ లాంకే, అజయ్ కుమార్ సుగంధ్, మహేష్ కుమార్ రోహిరా, ఆశిష్ అగర్వాల్‌ల నివాసాల్లోనూ ఈడీ తనిఖీలు చేపట్టింది.
ఈ సోదాల్లో రూ.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. రూ.45 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు అధికారులు. టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో అక్రమాలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది ఈడీ.
