తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నివాసంలో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. ఆయన కుమార్తె ప్రమేయం ఉన్న కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) అవినీతి కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిగినట్లు తెలిసింది.
మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటితో సహా కేరళ వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం సోదాలు నిర్వహించింది.
Breaking: ED raids 10 locations, including the residence of former #Kerala CM Pinarayi Vijayan!!
— Siraj Noorani (@sirajnoorani) May 27, 2026
This action is being taken in connection with an alleged money laundering case involving the IT firm of Pinarayi's daughter Veena Vijayan!! https://t.co/RcpQQczZG3 pic.twitter.com/GLXfaMwUTx
విజయన్ కూతురు టి. వీణకు చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్, ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడం గమనార్హం. సీఎంఆర్ఎల్ కేసులో ఈడీ దర్యాప్తును రద్దు చేయడానికి కేరళ హైకోర్టు నిరాకరించిన ఒక రోజు తర్వాత ఈ సోదాలు జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
- ఏంటి సీఎంఆర్ఎల్ కేసు..?
2017 నంచి 2020 మధ్య కాలంలో సీఎంఆర్ఎల్ నుంచి ఎక్సాలాజిక్ కు 1.72 కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్ అయినట్లు 2023లో ఆరోపణలు వచ్చాయి. ఎక్సాలాజిక్ ఎలాంటి సేవలు లేకుండానే కోట్ల రూపాయలు పొందినట్లు ఆరోపించారు. ఈ విషయంపై విచారణకు కేంద్రం ఆదేశించింది.
సుదీర్ఘ దర్యాప్తు తర్వాత Serious Fraud Investigation Office (SFIO) ఈ కేసులో విజయన్ కూతురు వీణ, ఈఎంఆరెల్ ఎండీ శశిధరన్ కార్థ తో పాటు 25 మందిని నిందితులుగా పేర్కొంది. సీఎంఆర్ఎల్, ఎక్సాలాజిక్ సొల్యుషన్స్, ఎంపవర్ ఇండియా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థలను కూడా లిస్టులో చేర్చింది.
SFIO రిపోర్టు ప్రకారం.. CMRL నుంచి వీణ 2 కోట్ల 70 లక్షల రూపాయలు లబ్ది పొందినట్లు పేర్కొంది. దీనికితోడు కోటి 72 లక్షల రూపాయలు కంపెనీకి చెల్లించినట్లు 2023లో ఇన్ కమ్ ట్యాక్స్ బోర్డు పేర్కొంది. 2025లో కార్పోరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఈ అవినీతి ఆరోపణలపై దర్యాప్తుకు అనుమతించింది. 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం వీణాపై సెక్షన్ 447 కింద కేసు నమోదు చేశారు.
