ఓం చారిటీ గ్రూప్‌పై ఈడీ దాడులు.. రూ. 300 కోట్లు గోల్ మాల్..?

ఓం చారిటీ గ్రూప్‌పై  ఈడీ దాడులు.. రూ. 300 కోట్లు గోల్ మాల్..?

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడుల కలకలం రేగింది. హోం చారిటీ గ్రూప్‌పై 11 చోట్ల సోదాలు చేశారు ఈడీ అధికారులు. విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్లు అరోపణలు రావడంతో ఈ రైడ్స్ చేసినట్టు తెలిపారు. రూ.300 కోట్ల విరాళాలు సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయని వెల్లడించారు. 16 దేశాల్లోని పిల్లలకు ఆహారం, విద్య అందిస్తామని నిధుల సేకరించారని తెలిపారు. 

   (యుఎస్ఎ, కెనడా, యుకె, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, డెన్మార్క్, జర్మనీ, ఫిన్లాండ్, ఐర్లాండ్, మలేషియా, నార్వే, బ్రెజిల్, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, రొమేనియా, సింగపూర్, స్వీడన్ స్విజ్జర్ ల్యాండ్) దేశాల్లో దళితులు  అణగారిన పిల్లలకు ఉచిత విద్య, భోజనాన్ని అందింస్తామని విదేశీ దాతల నుండి రూ. 300 కోట్లు సేకరించారని ఈడీ తెలిపింది.  ఈ మొత్తం నిధులు దారిమళ్లినట్టు తమకు సమాచారం అందిందని అందుకే రైడ్స్ చేస్తున్నామని ఈడీ తెలిపింది. 

హైదరాబాద్‌లోని  చుట్టుపక్కల 11 ప్రదేశాలలో ఆపరేషన్ మొబిలైజేషన్ గ్రూప్ ఆఫ్ ఛారిటీస్‌లో అక్రమాలకు సంబంధించి సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతోంది. ఈ రైడ్ లో వివిధ నేరారోపణ పత్రాలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.