నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ సమన్లు

నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ సమన్లు

న్యూఢిల్లీ: నటుడు ప్రకాష్ రాజ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి నటుడు ప్రకాష్ రాజ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గురువారం విచారణకు రావాలని పిలిచింది. తిరుచిరాపల్లికి చెందిన జ్యువెల్లరీ గ్రూప్ ద్వారా జరిగిన రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. తిరుచిరాపల్లికి చెందిన భాగస్వామ్య సంస్థ ప్రవణ్ జ్యువెల్లరీ పై ఇటీవల ఈడీ దాడులు నిర్వహించింది. రూ. 23.70 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. 

వచ్చేవారం చెన్నైలోని ఫెడరల్ ఏజెన్సీ ముందు విచారణకు హాజరు కావాలని ప్రకాష్ రాజ్ ను కోరింది. తమిళనాడు పోలీసులు నమోదు చేసిన ఈ కేసు ఈడీకి అప్పగించారు. తమిళనాడు పోలీసుల ఫిర్యాదు మేరకు ప్రణవ్ జ్యువెల్లర్స్, ఎక్కువ ఆదాయం పేరుతో బంగారు పెట్టుబడి పథకం పేరుతో ప్రజల నుంచి రూ. 100 కోట్లు వసూలు చేశారని ఫెడరల్ ఏజెన్సీ బుధవారం(నవంబర్24) తెలిపింది.

ఈ పెట్టుబడులు పెట్టుబడిదారులకు తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారని.. ప్రణవ్ జ్యువెలర్స్, దాని అనుబంధ వ్యక్తులు ప్రజల నిధులను షెల్ ఎంటీటీలు లేదా ఎంట్రీ ప్రొవైడర్ల షేర్ల బులియన్, బంగారు ఆభరణాల కొనుగోలు ముసుగులో మళ్లించడం ద్వారా మోసం చేశారని పేర్కొంది. ప్రణవ్ జ్యువెలర్స్ బుక్ లలోని సప్లయర్స్, ఎంట్రీ ప్రొవైడర్ల విచారణలో రూ. 100 కోట్లకు పైగా చేతులు మారాయని , బ్యాంకు చెల్లింపులకు బదులుగా నిందితులకు నగదు ఇచ్చినట్లు ఒప్పుకున్నట్లు ఈడీ తెలిపింది.