
హైదరాబాద్,వెలుగు: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో రానా దగ్గుబాటికి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఆగస్టు 11న విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈ మేరకు బుధవారం ఆయనకు సమాచారం అందించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన రానాదగ్గుబాటిని ఈ నెల 23న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.
షూటింగ్స్‌కు సంబంధించి ముందస్తు షెడ్యూల్ ఉన్నందున బుధవారం రాలేనని మరోరోజు విచారణకు వస్తానని రానా దగ్గుబాటి ఈడీని కోరారు. ఈ మేరకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఆగస్ట్ 11న హాజరు కావాలని సూచించారు.