హైదరాబాద్‌లో ESI కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు ఇవాళ(శనివారం) సోదాలు చేపట్టారు. హైదరాబాద్ లోని దాదాపు పది ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డితో పాటు నాయిని మాజీ పీఎస్ ముకుందారెడ్డి, మాజీ అధికారిణి దేవికారాణి వంటి పలువురి ఇళ్లలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే ESI లో వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల కుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. ఇందులో ESI మాజీ డైరెక్టర్ దేవికారాణి కూడా ఉన్నారు. నిందితులు గతంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అవినీతి అధికారిణి దేవికారాణి నుంచి ACB అధికారులు రూ.4.47 కోట్ల నగదును గతేడాది సెప్టెంబరులో స్వాధీనం చేసుకున్నారు.
