
న్యూఢిల్లీ: ఎడ్‌టెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా ఐపీఓ ద్వారా రూ.3,820 కోట్లను సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం అప్‌డేట్ చేసిన ప్రిలిమినరీ పేపర్లను సెబీ వద్ద ఫైల్ చేసింది. ఈ పబ్లిక్ ఇష్యూలో రూ.3,100 కోట్ల విలువైన కొత్త షేర్లను అమ్మనుండగా, ప్రమోటర్స్ ఆలఖ్ పాండే, ప్రతీక్ బూబ్ ఓఎఫ్‌ఎస్ కింద రూ.720 కోట్లను విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌లో రూ.460.5 కోట్లను కొత్త ఆఫ్‌లైన్, హైబ్రిడ్ సెంటర్స్ ఏర్పాటుకు, రూ.548.3 కోట్లను లీజు చెల్లింపులకు వినియోగించనున్నారు.
ఎక్స్‌లెమ్ లెర్నింగ్, ఉత్కర్ష్ క్లాసెస్ వంటి అనుబంధ సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడానికి, మార్కెటింగ్, క్లౌడ్, సర్వర్ల కోసం మిగిలిన అమౌంట్‌ను కేటాయించనున్నారు. ఫిజిక్స్‌వాలా జేఈఈ, నీట్, యూపీఎస్ వంటి పరీక్షల కోసం కోర్సులు అందిస్తోంది. ఈ కంపెనీకి యూట్యూబ్‌లో 98.8 మిలియన్ సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విస్తరిస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి రూ.2,887 కోట్ల ఆదాయంపై, రూ.243 కోట్ల నష్టం వచ్చింది.