- రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు : చదువుతోనే కుటుంబం, కులం గౌరవం పెరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. సోమవారం విద్యానగర్ లోని బీసీ భవన్ కు వచ్చిన విద్యార్థులతో ‘బడికి పోదాం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ పిల్లలను తప్పనిసరిగా బడికి పంపాలని సూచించారు.
చదువుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకోగలమని, ప్రతిభ బయటకు వస్తుందని చెప్పారు. చదువుతో పేద కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని తెలిపారు. ఏ దేశంలో 100% విద్యావంతులు ఉంటారో.. ఆ దేశం అగ్రగామిగా మారి, జ్ఞాన సమాజం ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వాలు విద్య, వైద్యానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
