గాంధీ సినిమా చూపించాలా వద్దా?.. ఉత్తర్వులు ఇవ్వని విద్యా శాఖ అధికారులు

గాంధీ సినిమా చూపించాలా వద్దా?..  ఉత్తర్వులు ఇవ్వని విద్యా శాఖ అధికారులు

హైదరాబాద్, వెలుగు : స్వాతంత్ర్య వ జ్రోత్సవాల ముగింపు సందర్భంగా సోమ వారం నుంచి ప్రారంభం కావాల్సిన ‘మహాత్మా గాంధీ’ సినిమా పిల్లలకు చూ పించడంపై స్కూల్ ఎడ్యుకేషన్​ అధి కారు ల్లో అయోమయం నెలకొన్నది. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మందికి సినిమా ఎలా చూపించాలి, ఏ తరగతి వరకూ చూపించాలనే విషయంపై స్పష్టత రాలే దు. 14 నుంచి 24 వరకూ రాష్ట్రంలోని 582 థియేటర్లలో ఉచితంగా గాంధీ సినిమా ప్రదర్శిస్తామని సర్కారు ప్రకటించింది. 

దీనిపై జిల్లాల్లో కలెక్టర్ల నుంచి ఒత్తిడి వస్తుండడంతో, కొందరు డీఈఓలు ఆదివారం జరిగిన టెలికాన్ఫరెన్స్​లో స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారుల నుంచి స్పష్టత కోరారు. ఇప్పటికే యాదాద్రి భువనగిరి, సిరిసిల్ల, హన్మకొండతో పాటు పలు జిల్లాల్లో సోమవారం సినిమా చూపించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లాలకు మాత్రమే సోమవారం సినిమా చూపించేందుకు పిల్లలను తీసుకుపోవాలని స్కూల్ ఎడ్యుకేషన్  డైరెక్టర్  శ్రీదేవసేన ఆదేశాలు జారీచేశారు.