కిటకిటలాడిన ఏడుపాయల

కిటకిటలాడిన ఏడుపాయల

పాపన్నపేట, వెలుగు : నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా గురువారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి వన దుర్గాభవాని మాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.