త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్‌లో శ్రీనివాస్ మన్నె తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. సోమవారం (డిసెంబర్ 08) ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఆత్మలు, దెయ్యాలు లేవని బలంగా నమ్మే కొందరు స్నేహితులు దాన్ని నిరూపించడానికి ఓ గ్రామానికి వెళ్తారు. వాళ్లకు తెలియని, వాళ్లు ఊహించడానికే భయపడే చీకటి ప్రపంచం మరొకటి ఉందని, దాన్ని నిరూపిస్తానని ఓ స్వామీజీ వాళ్లకు సవాల్ చేస్తాడు. అందుకు తగ్గట్టే అక్కడి వాళ్లకు అవాంఛనీయ ఘటనలు ఎదురవుతాయి.
పాడుబడిన బంగ్లా, అక్కడ గీసిన యంత్రాలు, దెయ్యాలు, క్షుద్ర పూజల నేపథ్యంలో సాగిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిరేపుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. డిసెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు.
