‘త్రీ రోజెస్’ సీజన్ 1లో నటించిన తాము సెకండ్ సీజన్‌లోనూ కొనసాగడం సంతోషంగా ఉందని ఈషా రెబ్బా, హర్ష చెముడు చెప్పారు. దర్శకుడు మారుతి షో రన్నర్‌గా కిరణ్ కె కరవల్ల దర్శకత్వంలో ఎస్‌కేఎన్ నిర్మించిన ‘త్రీ రోజెస్’ సీజన్ 2 ఈనెల 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా, హర్ష మీడియాతో ముచ్చటించారు. ఈషా రెబ్బా మాట్లాడుతూ ‘ఇందులో నాతో పాటు రాశీ సింగ్, కుషిత కీ రోల్స్ చేశాం. రాశీ ఫైర్ బ్రాండ్‌లా ఉంటే, కుషిత చిన్న పిల్లలా అల్లరి చేసేది.
గర్ల్స్ అంతా ఒక దగ్గర రెంట్‌కు ఉండటం, కలిసి సరదాగా కుకింగ్, గాసిప్స్ చెప్పుకోవడం, లైఫ్ లీడ్ చేయడం అనేది ఇందులో నాకు బాగా కనెక్ట్ అయింది. ఈ సీజన్ కోసం గ్లామర్ డోస్ పెంచలేదు. యూత్, ఫ్యామిలీ అంతా కలిసి సిరీస్ చూడొచ్చు. 30 నిమిషాల నిడివితో సాగే 6 ఎపిసోడ్స్. ఇక నేను, హర్ష చేసిన సీన్స్ సీజన్ 1లో బాగా వైరల్ అయ్యాయి. ఆ రెస్పాన్స్‌తో ఇందులో మరింత కాన్ఫిడెంట్‌గా చేశాం. మా ఇద్దరి కెరీర్‌లో ఇది స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది.
ఇక తరుణ్ భాస్కర్‌తో కలిసి నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతి’ రిలీజ్‌కు రెడీగా ఉండగా తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. యాక్షన్ మూవీస్‌లో నటించాలనే ఆసక్తి ఉంది. లాక్‌డౌన్‌లో మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నా” అని చెప్పింది. హర్ష చెముడు మాట్లాడుతూ ‘సీజన్ 1 లోని రివెంజ్‌ను తీర్చుకునేందుకు సీజన్ 2 లో నా పాత్ర ప్రయత్నిస్తుంటుంది. లైఫ్, రిలేషన్ షిప్స్, ఫ్రెండ్ షిప్ గురించిన విషయాలను సందేశాలు ఇచ్చినట్టు కాకుండా ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు.
ఇక ఇప్పటికే కొన్ని చిత్రాల్లో లీడ్ రోల్స్ చేసిన నేను సాయి రాజేశ్ గారి ప్రొడక్షన్‌లో ఒక మూవీలో లీడ్‌గా నటిస్తున్నా. అలాగే ‘ది రాజా సాబ్’లో ఒక కీలకపాత్ర పోషించా. సంక్రాంతికి రాబోయే అన్ని సినిమాల్లో నటించా. ఫలానా హీరోతో, ఫలానా జానర్‌లో వర్క్ చేయాలి అని కాకుండా.. ప్రతి రోజూ వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో ఉండాలనేది నా కోరిక”అని చెప్పాడు.

