ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయం అందేలా కృషి.. పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ఎస్సీ,  ఎస్టీలకు సత్వర న్యాయం అందేలా కృషి.. పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

హనుమకొండ, వెలుగు: ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో జిల్లా కలెక్టర్ చాహత్​ బాజ్​పాయ్​, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవితతో కలిసి భూ సమస్యలు, హక్కుల పరిరక్షణ, అట్రాసిటీ కేసుల పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా చెరబండ రాజు కాలనీవాసులకు హనుమకొండ న్యూ శాయంపేటలో నిర్మించిన డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు చట్టప్రకారం రక్షణ, ఆర్థిక సహాయం, పునరావాసం, న్యాయ సహాయం సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.