ఏకలవ్య స్కూల్స్లో కొలువుల జాతర.. 7267 పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

 ఏకలవ్య స్కూల్స్లో కొలువుల జాతర.. 7267 పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) రిక్రూట్​మెంట్ –2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్​లో భాగంగా 7,267 టీచింగ్,  నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 23. 

పోస్టుల సంఖ్య: 7267.

పోస్టులు: ప్రిన్సిపాల్ 225, పీజీటీ టీచర్ 1,460, హాస్టల్ వార్డెన్(పురుషులు) 346, జూనియర్ సెక్రటేరియట్ ఆసిస్టెంట్ (క్లర్క్) 228, అకౌంటెంట్ 61, స్టాఫ్​నర్స్(మహిళలు), టీజీటీ టీచర్ 3,962, హాస్టల్ వార్డెన్ (మహిళలు) 289, ల్యాబ్ అటెండెంట్ 146. 
ఎలిజిబిలిటీ

ప్రిన్సిపల్: పీజీతోపాటు బి.ఎడ్. వైస్ ప్రిన్సిపాల్​గా పనిచేసిన అనుభవం ఉండాలి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): పీజీతోపాటు సంబంధిత సబ్జెక్టులో బి.ఎడ్. 

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్​తో పాటు బి.ఎడ్. సి–టెట్ లో అర్హత సాధించి ఉండాలి.

స్టాఫ్ ​నర్స్ (మహిళలు): బీఎస్సీ నర్సింగ్.

హాస్టల్ వార్డెన్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ.

అకౌంటెంట్: కామర్స్​లో గ్రాడ్యుయేషన్. 

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 

ల్యాబ్ అటెండెంట్: పదోతరగతి, ల్యాబ్ టెక్నిక్ డిప్లొమా లేదా సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: ప్రిన్సిపాల్​కు 50 ఏండ్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) 40 ఏండ్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), స్టాఫ్​నర్స్(మహిళలు), హాస్టల్ వార్డెన్​కు 35 ఏండ్లు,  అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్​కు 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 19.

లాస్ట్ డేట్: అక్టోబర్ 23.

అప్లికేషన్ ఫీజు: ప్రిన్సిపాల్ జనరల్,  ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2500, టీజీటీ, పీజీటీ పోస్టులకు జనరల్,  ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2000, నాన్ టీచింగ్ పోస్టులకు జనరల్,  ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500. అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, మహిళా అభ్యర్థులకు రూ.500. 

సెలెక్షన్ ప్రాసెస్: ప్రిన్సిపాల్ పోస్టులకు మినహా అన్ని పోస్టులకు టైర్–I, టైర్–II రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిన్సిపాల్ పోస్టులకు అదనంగా ఇంటర్వ్యూ ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ పోస్టులకు అదనంగా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. 

పూర్తి వివరాలకు nests.tribal.gov.in  వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

ఎగ్జామ్ ప్యాటర్న్: టైర్--–I  ఎగ్జామ్ ఓఎంఆర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో అడుగుతారు.  టైర్--–II ఎగ్జామ్​లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతోపాటు  డిస్క్రిప్టివ్ ప్రశ్నలను కూడా అడుగుతారు. 


టైర్-I  ప్రిలిమినరీ ఎగ్జామ్
ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్--–Iలో జనరల్ అవేర్​నెస్ 10 ప్రశ్నలు 10 మార్కులకు, పార్ట్–-I-Iలో రీజనింగ్ & న్యూమరికల్ ఎబిలిటీ 15 ప్రశ్నలు 15 మార్కులకు,  పార్ట్–--IIIలో ఐసీటీ నాలెడ్జ్ 15 ప్రశ్నలు 15 మార్కులకు, పార్ట్–-IVలో టీచింగ్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, పార్ట్–--Vలో డొమైన్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటుంది. పార్ట్– -VI లో భాగంగా 20 మార్కులకు లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ( జనరల్ ఇంగ్లిష్​, హిందీ) నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఈ పార్ట్​లో 40 శాతం లేదా 8 మార్కులకు సాధిస్తే సరిపోతుంది. 

మిగతా అన్ని పోస్టులకు : ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. టైర్–I  ప్రిలిమినరీ ఎగ్జామ్​లో జనరల్ అవేర్​నెస్, రీజనింగ్ ఎబిలిటీ, ఐసీటీ నాలెడ్జ్, క్వాంటేటివ్ ఆప్టిట్యూడ్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 

టైర్-II (సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్): అన్ని పోస్టులకు టైర్– II ఎగ్జామ్ ఒకే విధంగా ఉంటుంది. ఇందులో నిర్దిష్టమైన సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 40 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు 40 మార్కులకు, 15 డిస్క్రిప్టివ్ ప్రశ్నలు 60 మార్కులకు మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 

గమనిక: మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలపై నిర్వహించే ఎగ్జామ్​లో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు  మార్కులు కోత విధిస్తారు.

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

టైర్-I  ప్రిలిమినరీ 
పార్ట్ -Iలో రీజనింగ్ ఎబిలిటీ 25 ప్రశ్నలు 25 మార్కులకు, పార్ట్–IIలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, పార్ట్-IIIలో జనరల్ అవేర్​నెస్ 20 ప్రశ్నలు 20 మార్కులకు,  పార్ట్-IVలో కంప్యూటర్ఆపరేషన్స్ పై సాధారణ పరిజ్ఞానం 10 ప్రశ్నలు 10 మార్కులకు, పార్ట్-Vలో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ (జనరల్ ఇంగ్లిష్​) 10 ప్రశ్నలు 10 మార్కులకు, పార్ట్-VIలో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ (జనరల్ హిందీ​) 10 ప్రశ్నలు 10 మార్కులకు ఉంటుంది.  

టైర్-III (టైపింగ్ టెస్ట్) 
టైపింగ్ టెస్ట్ పర్సనల్ కంప్యూటర్​పై నిర్వహిస్తారు. మొత్తం 50 మార్కులకు ఎగ్జామ్​ ఉంటుంది. కనీస అర్హత మార్కులు 20. ఇందులో అర్హత సాధించిన వారికి టైర్-II మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

టైర్-I  ప్రిలిమినరీ ఎగ్జామ్
ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ –--Iలో రీజనింగ్ & న్యూమరికల్ ఎబిలిటీ 10 ప్రశ్నలు 10 మార్కులకు, పార్ట్–IIలో జనరల్ అవేర్​నెస్ 10 ప్రశ్నలు 10 మార్కులకు, పార్ట్-–IIIలో విద్యా, నివాస అంశాలు 30 ప్రశ్నలు 30 మార్కులకు,  పార్ట్–-IVలో అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, పార్ట్-–Vలో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ 20 ప్రశ్నలు 20 మార్కులకు ఉంటుంది. 

టైర్-III ఇంటర్వ్యూ 
టైర్–II ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను షార్ట్​లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ 40 మార్కులకు ఉంటుంది. టైర్– -II రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.