సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు .. 20 రోజుల్లో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం కూలిపోతుంది

సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు .. 20 రోజుల్లో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం కూలిపోతుంది

శివసేన (యుబీటీ) లీడర్  సంజయ్ రౌత్ సంచలన వాఖ్యలు చేశారు.  ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం 15- నుంచి 20 రోజుల్లో కూలిపోతుందంటూ కీలకవ్యాఖ్యలు చేశారు.  శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఇప్పటికే డెత్‌ వారంట్‌ జారీ అయ్యిందని విమర్శించారు.

ఉద్దవ్ ఠాక్రే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌తో సహా అనేక పిటిషన్లపై  తీర్పులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ తీర్పు కోసం తాము ఎదురుచూస్తున్నామని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని సంజయ్ రౌత్ చెప్పారు. 

సీఎం  ఏక్నాథ్ షిండే ఆయన 40 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం 20 రోజుల్లో కూలిపోతుంది. దీంతో ప్రభుత్వం డెత్ వారెంట్ జారీ చేసింది. దానిపై ఎవరు సంతకం చేస్తారనేది ఇప్పుడు 20 రోజుల్లో కూలిపోతుంది. దీంతో ప్రభుత్వం డెత్ వారెంట్ జారీ చేసింది. దానిపై ఎవరు సంతకం చేస్తారనేది ఇప్పుడు  నిర్ణయించాల్సి ఉందని సంజయ్ రౌత్  అన్నారు.  ఫిబ్రవరిలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కూలిపోతుందని సంజయ్ రౌత్ గతంలో కూడా ఈలాంటి కామెంట్స్ చేశారు. 

కాగా గత ఏడాది జూన్‌లో  షిండేతో పాటుగా మరో 39 మంది ఎమ్మెల్యేలు శివసేన నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, ఫలితంగా ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది.  దీంతో సీఎం పదవికి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేశారు. అనంతరం ఏక్‌నాథ్‌ షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. గత ఏడాది జూన్‌ 30న షిండే సీఎంగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 

 మరోవైపు ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లు, కౌంటర్‌గా షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వీటిపై తీర్పును గత నెలలో రిజర్వ్‌ చేసింది. మరో 1,5-20 రోజుల్లో ఈ తీర్పులను సుప్రీంకోర్టు వెల్లడించనున్నది.