పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కైట్అండ్ -స్వీట్ ఫెస్టివల్ – 2026 ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వల్లూరు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఉత్సవాన్ని నిర్వహిస్తామన్నారు.
వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే కైట్ ఫ్లైయర్లు, మిఠాయి నిర్వాహకులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సందర్శకుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్, పార్కింగ్, భద్రతపై పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆమె వెంట జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుజాత ఉన్నారు.
