ఇన్‌స్పైరింగ్ స్టోరీ షేర్ చేసిన మిలియన్ డ్రీమ్స్ అకాడమీ ఫౌండర్

 ఇన్‌స్పైరింగ్ స్టోరీ షేర్ చేసిన మిలియన్ డ్రీమ్స్ అకాడమీ ఫౌండర్

లింక్డ్ ఇన్ లో చాలా మంది అనేక రకాల మోటివేషనల్, ఇన్ స్పైర్డ్ స్టోరీస్ ను షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఒకటి  మిలియన్ డ్రీమ్స్ అకాడమీ వ్యవస్థాపకుడు సంజయ్ ముద్నానీ షేర్ చేసిన ఓ పోస్ట్. ఈ పోస్ట్ లో తాను ఇటీవల కలిసిన ఓ 92ఏళ్ల వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు. తాను గత కొన్ని రోజుల క్రితం స్టార్ బక్స్ కు వెళ్లినపుడు ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పారు. అతని పేరు మిస్టర్ కేకీ అని ప్రారంభించిన సంజయ్.. ఆయన తన తన ఇంటి నుంచి రిక్షాలో స్టార్ బక్స్ కు వచ్చాడన్నారు. చూడడానికి బలహీనంగా, కర్ర పట్టుకొని నడుస్తున్నా.. స్వయంగా ఆయనే వచ్చి ఆర్డర్ చేశాడన్నారు. ఈ సందర్భంలోనే ఆ వ్యక్తికి తాను పరిచయమయ్యానని స్పష్టం చేశారు.

మామూలుగా కథలు వినడం తనకిష్టమన్న సంజయ్.. మిస్టర్ కేకీ చెప్పే మాటలను ఆసక్తిగా వింటూ కూర్చున్నానన్నారు. అయితే ఆ పెద్ద మనిషి మాట్లాడుతూ.. మనం చేసే పని పట్ల ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలని చెప్పినట్టు సంజయ్ తెలిపారు. మీకు వచ్చేది మీకు వస్తుంది, లేని దాని గురించి చింతించకండి.. అది మీకు చెందాల్సింది కాకపోవచ్చు అని మిస్టర్ కేకీ సూచించారన్నారు. ఎవరి పట్లా చెడుగా ప్రవర్తించలేదని, ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదని చెప్పినట్టు సంజయ్ తెలిపారు. దీర్ఘాయుష్షు పొందాలంటే ఎలాంటి ఆందోళనలు పెట్టుకోవద్దని చెప్పారన్నారు. అనంతరం అతనికి ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఎందుకంటే అతను ప్రపంచం మొత్తం పర్యటించారని, నిజాయితీగా జీవించాడని సంజయ్ తన పోస్టులో వెల్లడించారు. మిస్టర్ కేకీ తన జీవితంలో చిన్న చిన్న ఆనందాలను ఎంజాయ్ చేస్తున్నట్టు అతన్ని చూస్తే అర్థమైందని సంజయ్ రాసుకొచ్చారు. అతన్ని కలిసిన తర్వాత జీవితం పూర్తిగా ఆనందంతో ఎలా జీవించాలనే సందేహం అవగతమైందన్నారు. అదే స్ఫూర్తితో, హృదయం నిండా ఆనందం, ముఖం మీద చిరునవ్వుతో స్టార్ బక్స్ నుంచి బయటికొచ్చానని స్పష్టం చేశారు. ఈ పోస్ట్ చాలా మందికి ఇన్ స్పైరింగ్ గా నిలవడంతో మిస్టర్ కేకీని యూజర్స్ ప్రశంసిస్తున్నారు. ఇంత గొప్ప స్ఫూర్తి దాయక కథాంశాన్ని షేర్ చేసినందుకు సంజయ్ కి క-ృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

https://in.linkedin.com/in/sanjaymudnaney?trk=public_post_embed_feed-actor-name