గోనె సంచిలో వృద్ధురాలి డెడ్బాడీ

 గోనె సంచిలో  వృద్ధురాలి డెడ్బాడీ

పరిగి, వెలుగు: కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన ఓ వృద్ధురాలి మృతదేహం గోనెసంచిలో లభ్యమైంది. పూడూరు మండలం చెన్గొముల్​ గ్రామానికి చెందిన బేగరి రాములమ్మ(80) కొన్ని రోజుల క్రితం అదృశ్యమైంది. ఈ నెల 21న పోలీస్​స్టేషన్​లో మిస్సింగ్​ కేసు నమోదైంది. ఈ నెల 24న మధ్యాహ్నం ఓ పాడుబడ్డ బావి నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా గోనె సంచిలో కుళ్లిన స్థితిలో రాములమ్మ డెడ్​బాడీ కనిపించింది. 

దుండగులు ఆమెను హత్య చేసి గోనె సంచిలో పడేసి వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇదే గ్రామానికి చెందిన కావలి సత్యం(40) ఓ ఫాంహౌస్​లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన బుధవారం ఫాంహౌజ్​లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.