హైదరాబాద్ సిటీ, వెలుగు: సర్ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సెక్రటరీ నవీన్ కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం శుక్రవారం నుంచి క్యూర్ పరిధిలోని పర్యటించనుంది.
ఈ పర్యటనలో ఓటర్ల జాబితా సవరణ పనుల పురోగతి, ఇంటింటి సర్వే, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల మార్పులు, తొలగింపుల ప్రక్రియతో పాటు ఎన్నికల సిబ్బంది నిర్వహణను బృందం ప్రత్యక్షంగా పరిశీలించనుంది.
జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు(ఈఆర్‌వోలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (ఏఈఆర్‌వోలు), బూత్ లెవల్ అధికారుల(బీఎల్‌వోలు)తో సమావేశమై ‘సర్’ అమలుపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది.
