బీజేపీకి పడని ఓట్లను తొలగించే కుట్ర..ప్రధాని మోదీకి అనుకూలంగా పనిచేస్తున్న ఎలక్షన్ కమిషన్

బీజేపీకి పడని ఓట్లను తొలగించే కుట్ర..ప్రధాని మోదీకి అనుకూలంగా పనిచేస్తున్న ఎలక్షన్ కమిషన్
  • ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీజేపీకి అధికారం కలే
  • ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీజేపీకి అధికారం కలే..
  • బీఆర్ఎస్​బావబామ్మర్దులను ప్రజలు నమ్మట్లే : టీపీసీసీ చీఫ్​మహేశ్ కుమార్​గౌడ్

నిజామాబాద్, వెలుగు : 'వెస్ట్​బెంగాల్ లో 93 లక్షల ఓట్లను చోరీ చేసి మమతాబెనర్జీని ఓడగొట్టిన బీజేపీ అదే ప్లాన్ ను తెలంగాణలో అమలు చేసేందుకు కుట్ర చేస్తోంది' అని టీపీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆ ఎత్తులు ఇక్కడ సాగవని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం జరిగే పనికాదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​నబీన్ సభ రెండు వేల మంది కూడా రాలేదని, ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమిటో ఈ సభలతోనే అర్థం అవుతుందన్నారు. 

నిజామాబాద్​జిల్లా నందిపేటలో సోమవారం జరిగిన బీఎల్​ఏల మీటింగ్​లో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఎలక్షన్​కమిషన్​ప్రధాని మోదీకి తొత్తుగా పనిచేస్తోందని ఆరోపించారు. ఓట్లను తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్​బీఎల్​ఏలు అడ్డుకోవాలని, పట్టణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. చెల్లె కవితను బయటకు పంపిన కేటీఆర్.. బావ హరీశ్​రావును వెంటేసుకొని రాష్ట్రమంతా తిరుగుతున్నారని, వాళ్లిద్దరు ఒకరికొకరు హ్యాండ్​ఇచ్చుకోవడానికీ వెనుకాడరని ఎద్దేవా చేశారు. వారిద్దరినీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 

అనంతరం నిజామాబాద్ లో ఓలింపిక్ రన్ ను ప్రారంభించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీకి 8 సీట్లు కూడా రావన్నారు. ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా, ఇతర పార్టీలతో కలిసినా అధికారంలోకి మాత్రం రాదన్నారు. కాంగ్రెస్​100 సీట్లకుపైగా గెలిచి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్​హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, పన్నెండున్నరేండ్ల సెంట్రల్​గవర్నమెంట్​మోసాలపై చర్చకు రావాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావుకు సవాల్​చేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్​రెడ్డి, రూరల్​ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, ఆకుల లలిత, నగేశ్ రెడ్డి, అంతిరెడ్డి రాజిరెడ్డి, చిన్నా పాల్గొన్నారు.